ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌, బండి సంజయ్‌ ఏరియల్‌ సర్వే

by Mahesh |   ( Updated:2024-09-05 07:21:01.0  )
ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌, బండి సంజయ్‌ ఏరియల్‌ సర్వే
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పట్టణంలోని 20కి పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకొని భారీగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వివిధ రకాల పంటలు పూర్తిగా తూడ్చిపెట్టుకుపోయాయి. కాగా వరదలపై సమిక్షించడానికి ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌, బండి సంజయ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు కోదాడకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేరుకోని.. కోదాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే ఎరియల్ సర్వే అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీలో వరద నష్టం పై అధికారులతో సమీక్షించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed