వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు.. ఈ నెల 31వ తేదీ వరకు గడువు

by Mahesh |   ( Updated:2023-07-09 12:50:01.0  )
వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు.. ఈ నెల 31వ తేదీ వరకు గడువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ(Hons.)మొదటి సంవత్సరంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో ఎంసెట్- 2023 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఆదివారం తెలిపారు.వనపర్తి, కరీంనగర్ లో ఉన్న మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి గల యువతులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఎంసెట్-2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. సీటు సాధించిన విద్యార్థినీలు కాలేజీ హాస్టల్ లోనే ఉండాలని, డే-స్కాలర్స్ విధానం ఉండదని మల్లయ్య బట్టు స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.2,00,000/- మించని విద్యార్థినీలు మాత్రమే అర్హులని తెలిపారు .దరఖాస్తు చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయ పనివేళల్లో 040-23328266 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

Advertisement

Next Story