- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్చిలోపు పనులు పూర్తి చేయాలి
by Sridhar Babu |

X
దిశ, ఆసిఫాబాద్ : మార్చిలోపు ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్ర వారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో పనులు సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. అదనపు గదులు, మూత్రశాలలు, ప్రహరీ గోడ నిర్మాణం, భవన మరమ్మతులు, సైన్స్ ల్యాబ్, సీసీ కెమెరాల ఏర్పాటు తోపాటు ఇతర మౌలిక వసతులు చేపట్టి మార్చి నెల చివరి కన్నా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story