- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిర్పూర్ నియోజకవర్గంపై RSP ఫోకస్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్..!
దిశ ప్రతినిధి, నిర్మల్: బహుజన సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కన్ను పెట్టారా..? అంటే అవునని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆ మాజీ ఐపీఎస్ అధికారి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గం అయినా ఎస్సీ నియోజకవర్గం నుండి కాకుండా జనరల్ స్థానం నుంచి పోటీ చేసి బహుజన వాదాన్ని చాటాలని ఆర్ఎస్ ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారని ఇందులో భాగంగానే గత మూడు రోజులుగా ఆయన సిర్పూర్ నియోజకవర్గంలో మకాం పెట్టి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
అక్కడి నుంచి ఎందుకంటే..
సిర్పూర్ నియోజకవర్గం నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలనే యోచనలో వెనుక వివిధ రాజకీయ కారణాలు, కోణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గ రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడం కన్నా జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా అది ప్రచారంలోకి వస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో నుంచి బహుజన సమాజ్ పార్టీ గెలిచిన చరిత్ర కూడా ఉంది. ప్రస్తుత అధికార పార్టీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గెలిచి ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విధితమే. ఏనుగు గుర్తు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ పరిచితం కావడం కూడా ఒక కారణం అని తెలుస్తోంది. పేపర్ మిల్లు కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కార్మికులు ఉండటం వారి సమస్యలను ప్రస్తావించేందుకు బలమైన గొంతు అవసరమైనందున దాన్ని ఆయుధంగా మలుచుకోవాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఆ నియోజకవర్గంలో జనరల్ ఓట్ల కన్నా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మరోవైపు తాను సుదీర్ఘకాలం పనిచేసిన సాంఘిక సంక్షేమ శాఖ విద్యాలయాల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో చదువుకున్న వందల మంది విద్యార్థులు, తన సొంత సైన్యం స్వేరోస్ కూడా ప్రాంతంలో భారీగానే ఉన్నారని సమాచారం. వీరంతా ప్రవీణ్ కుమార్‌ను తమ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా పేరొందిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కొంత బలహీన పడినట్లు కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాక ఎమ్మెల్యే తమ్ముడు జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బీఎస్పీ అంచనా వేస్తోంది.
మూడు రోజులు నుండి అక్కడే..
బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం రాజకీయ కేంద్రం అయిన కాగజ్ నగర్‌లో మూడు రోజులుగా మకాం వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అక్కడే ఉండి నియోజకవర్గంలోని పరిసర మండలాలకు వెళ్లి వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజా వ్యూహం చూస్తుంటే.. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.