గురుకుల దరఖాస్తూలలో నిబంధనలు మార్పు..!

by Aamani |
గురుకుల దరఖాస్తూలలో నిబంధనలు మార్పు..!
X

దిశ,కుబీర్ : గురుకుల ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తులో నిబంధనలు మార్పు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తు సమయంలోనే కుల ఆదాయ,సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.గతంలో బోనఫైడ్ సర్టిఫికెట్ తో పూర్తి అయ్యేదని కుల ఆదాయం ఇప్పట్లో అడిగేవారు కాదు . కుల, ఆదాయ, సర్టిఫికెట్ నిబంధన తప్పనిసరి కావడంతో పనులను వదులుకొని తహసిల్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల సర్టిఫికెట్ కోసం నోటరీ తదితర ఫార్మాలిటీ పూర్తి చేయడానికి పనులు వదులుకొని తిరగాల్సి వస్తుందనివాపోతున్నారు. పరీక్ష రాసి సీటు వచ్చిన తర్వాత చేసే పనులు, ప్రతి ఒక్కరు ఇప్పుడే ఇవ్వాలన్న నిబంధనతో దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతుందని పలువురు అంటున్నారు. దరఖాస్తు సమయంలో నిబంధనలో సడలింపు ఇవ్వాలని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed