- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజల సంక్షేమాభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
దిశ, బోథ్ : ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి అల్లోల ఇందక్రరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నియోజకవర్గ కేంద్రంలో పదికోట్ల యాభై ఆరు లక్షలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్, జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, జలసంఘం, నీటి వనరుల శాఖ చైర్మన్ వేణుగోపాల చారి, కలెక్టర్ రాహుల్ రాజ్ లతో కలిసి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు యాభై కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ రైతులకు కరెంట్ అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు సైతం ఫిల్టర్ నీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని, కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆసుపత్రి భూమిపూజ కార్యక్రమానికి బయలు దేరుతున్న మంత్రి అల్లోల కాన్వాయ్ ని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరమాండల్ వద్ద అడ్డుకున్నారు. వీరిని పోలీస్ లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులు రాజు యాదవ్, సుభాష్ సూర్య, బోర్ రవీందర్, తుము సూర్యం, పలువురు నాయకులను సైతం ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.