ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థి పరిస్థితి విషమం

by Sridhar Babu |
ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థి పరిస్థితి విషమం
X

దిశ, వాంకిడి : మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో గత నెల 30న జరిగిన ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న సావాతి జీపీ దాబా గ్రామానికి చెందిన శైలజ పరిస్థితి విషయంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నాలుగు రోజుల చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ నిమ్స్ కు రెఫెర్ చేశారు.

గతవారం నుంచి ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా విషమించడంతో శైలజను వెంటిలేటర్ పై ఉంచి మళ్లీ చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మరోవైపు శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed