- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పోలీస్ స్టేషన్ నుండి నిందితుడి పరారీ.. ప్రెస్ మీట్ పెట్టిన గంటకే..
పోలీస్ స్టేషన్ నుండి నిందితుడి పరారీ.. ప్రెస్ మీట్ పెట్టిన గంటకే..
by Nagam Mallesh |

X
దిశ, భైంసాః నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మారణాయుధాలతో పట్టుబడిన అబ్దుల్ జూబేర్(27) అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటనపై శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశం ముగిసిన దాదాపు గంట సమయానికే నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది. నీరు తాగుతానని అనడంతో సిబ్బంది నీరు తీసుక వచ్చేలోపే నిందితుడు పరారీ అయ్యారని స్థానిక పోలీసులు వాపోతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న సీఐ, ఏఎస్పి విస్తృతంగా గాలిస్తున్నారు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తూ.. ఆచూకీ కోసం వెతుకుతున్నారు.భైంసా పట్టణానికి అనుకొని వున్న ఓ గుట్టవద్ద దాదాపు 30 మందికి పైగా పోలీసులు గంటల సేపు గాలింపు చర్యలు చేశారు. అయినా సరే ఇంకా నిందితుడి జాడ దొరకలేదు.
Next Story