సంక్షేమ పథకాల్లో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Shiva |
సంక్షేమ పథకాల్లో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, సారంగాపూర్: సంక్షేమ పథకాలలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని, నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాంసింగ్ తండాలో రూ.1.10కోట్లతో వ్యయంతో నిర్మించనున్న 33/11 కే.వీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 58 సబ్ స్టేషన్లు, సారంగపూర్ మండలంలో 10 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు.

6 చెక్ డ్యాంలను మండలంలో నిర్మించుకున్నట్లు తెలిపారు. గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లోవోల్టేజీ సమస్యలతో వినియోగదారులు అవస్థలు పడ్డారని, ఇప్పుడు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపారు. అదేవిధంగా అడెల్లి పోచమ్మ ఆలయాన్ని రూ.15 కోట్ల నిధులతో కృష్ణ శిలలతో నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.కోటి నిధులతో జగదాంబ మాత సేవాలాల్ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

త్వరలో నిర్మల్ లోనే రూ.2కోట్ల తో బంజారా భవన్ ను నిర్మిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మెన్ ఐటీ చందు, ఏఎంసీ ఛైర్మెన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ దత్తురాం, గ్రామ ఇన్ చార్జి సర్పంచ్ మీరా బాయి, అయ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story