- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేత్రపర్వంగా రాములోరి కళ్యాణ వేడుకలు..
దిశ, బెల్లంపల్లి: సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, బెల్లంపల్లి బస్తి, టేకుల బస్తిలోని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ కోదండ రామాలయంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి హైమావతి, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులు సీతారాముల కల్యాణ వేడుకలను తిలకించడానికి భారీగా తరలివచ్చారు. శ్రీ కోదండ రామాలయం కమిటీ చైర్మన్ రేనికుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. రాములవారి కల్యాణ వేడుకలకు ప్రత్యేకంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. రంగ రంగ వైభవంగా జరిగిన రాములోరి పెళ్లిని భక్తులు ఆసక్తిగా తిలకించారు. బెల్లంపల్లి ఎస్ఐలు ఆంజనేయులు, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది వేడుకలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఆయా దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.