- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వాయి పాపన్న పోరాటం ఆదర్శంః కలెక్టర్ రాజార్షి షా
దిశ, ఆదిలాబాద్ః ప్రజల సంక్షేమం కోసం ఆనాడు సర్వాయి పాపన్న చేసిన పోరాటం యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా అన్నారు. వెనుకబడిన తరగతుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జిల్లా అదనపు ఎస్పీ, పలువురు గౌడ సంఘం సభ్యులతో కలిసి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల బాగుకోసం నాడు శత్రుముకలతో ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసిన మహనీయుడు, బహుజనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ జిల్లా అధికారి రాజలింగు, తెలంగాణ గౌడ సంఘం జిల్లా నాయకులు, సభ్యులు, పలువురు కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఎనగంటి ప్రకాష్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.