- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ysrcp: మాజీ మంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి శైలజానాథ్(Former Minister Sailajanath)కు వైసీపీ(Ycp)లో కీలక బాధ్యతలు లభించాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త(Singanamala Constituency Coordinator)గా ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) నియమించారు. గతంలో ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. పలు కీలక పదవులు అనుభవించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని శైలజానాథ్‌కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో శైలజానాథ్ స్పందించారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతను స్వీకరించి శింగనమల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని శైలజానాథ్ తెలిపారు.