ఇంచార్జి డీపీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి..

by Sumithra |
ఇంచార్జి డీపీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి..
X

దిశ, నిర్మల్ రూరల్ : ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన నిర్మల్ జిల్లా ఇంచార్జి డీపీఆర్ఓ పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి శనివారం వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ జిల్లా ఇంచార్జి డీపీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారిని బీసీ తెగకు చెందినవారని, ఎస్టీ ధ్రువపత్రంతో ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తూ ప్రభుత్వవేతనాన్ని అక్రమంగా పొందుతున్నారని ఆరోపించారు.

ఇంచార్జి డీపీఆర్ఓ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎస్టీ తెగలలో నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుంటే, ఇతర తెగలవారు తప్పుడు ధృవపత్రాలతో ఉద్యోగాలు పొందటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంచార్జి డీపీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకీ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వెంక గారి నర్సయ్య (సత్య), జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, సభ్యులు మహేందర్, మధు, రామచందర్, పోతురాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story