- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్..

దిశ ప్రతినిధి, నిర్మల్ : జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి. బి, లక్ష్మణ్ చందా మండలం మల్లాపూర్, ముధోల్ మండలం తరోడ, బాసర మండలంలోని కౌట నాలుగు ఆరోగ్య కేంద్రాలకు ఈ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్లు లభించినట్లు తెలిపారు. జాతీయ స్థాయి బృందం అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, పలునాణ్యత ప్రమాణాలను బేరీజువేసి ఉత్తమ నాణ్యత ప్రమాణాలు గల ఆరోగ్య కేంద్రాలుగా గుర్తింపును ఇచ్చినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు తమ పనితీరు కనబరిచి భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు, అవార్డులు అందుకోవాలని కలెక్టర్ తెలిపారు.