ఖద్దర్ పై ఖాకీ కన్నెర్ర.. పోలీస్ బాస్ కు ఫిర్యాదు...

by Sumithra |
ఖద్దర్ పై ఖాకీ కన్నెర్ర.. పోలీస్ బాస్ కు ఫిర్యాదు...
X

దిశ, బెల్లంపల్లి : పోలీసుల తీరు ఇంకా మారాల్సి ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం, పోలీస్ బాస్ లు ఓవైపు అహర్నిశలు కృషి చేస్తంటే.. మరోవైపు కొందరు పోలీస్ అధికారుల తీరులో ఇంకా మార్పురానట్టు కనిపిస్తుంది. అందుకు మచ్చుతునకగా మందమర్రి ఎస్సై ఉదంతాన్ని పేర్కొనవచ్చు. బెల్లంపల్లి మండలం చాకపల్లి ఎంపీటీసీ, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్ మందమర్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఓ తగాదా విషయంలో ఎస్సై చంద్రకుమార్ తో మాట్లాడేందుకు వెళ్లిన ఆయనకు పరాభవం తప్పలేదు.

తనపట్ల అమర్యాదగా దురుసుగా వ్యవహరించి అవమానించినట్లు కాంగ్రెస్ యువనేత ముడిమడుగుల మహేందర్ ఆరోపించారు. తనను అవమానపరిచిన మందమర్రి ఎస్సై చంద్రకుమార్ పై కాంగ్రెస్ యువనేత మహేందర్ బెల్లంపల్లి ఏసీపీ సదయ్యకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. దీంతో మందమర్రి ఎస్సై చంద్రకుమార్ వ్యవహారం చర్చనీయంశంగా మారింది. ఓ కేసు విషయమై మాట్లాడటానికి ఈ నెల15వ తేదీన మందమర్రి పోలీస్ స్టేషన్ వెళ్లగా ఎస్సై చంద్రకుమార్ అసబ్యకర పదజాలంతో దూషించి అవమానించారని మహేందర్ ఆరోపించారు.

ఒక ప్రజాప్రతినిధినైన తనతోనే ఇలా వ్యవహారిస్తే సామాన్య ప్రజలతో సదరు పోలీస్అధికారి ఎలా వ్యవహరిస్తున్నారో ఈ సంఘటనతో తేటతేల్లమైందన్నారు. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటే మందమర్రి ఎస్సై మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం వివాదాస్పదంగామారింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరంగా ఎస్సైపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. అంతే కాకుండా ఈ విషయాన్ని మంచిర్యాల డీసీపీ, రామగుండం సీపీ, డీజీపీల దృష్టికి కూడా తీసుకువెళుతున్నట్లు మహేందర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed