- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA : వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తాం
దిశ, మంచిర్యాల : వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తాం అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీవియోగం ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చిలక జోష్యం చెప్పడం మానుకోవాలని అన్నారు. ఆదివారం ఐబీ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామని తెలిపారు. 100 సీట్లతో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం అనేది అసంభవమని, బీఆర్ఎస్ దుకాణం మూతపడిందని తెలిపారు.
కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, కుటుంబ సమస్యలు లాంటివన్నారు. మంచిర్యాలలో రూ.300 కోట్ల వ్యయంతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు ఈనెలాఖరులో ఆరంభం అవుతాయని పేర్కొన్నారు. రూ.255 కోట్లతో కరకట్ట నిర్మాణం పనులు కూడా మొదలవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం నిర్ధేశిత గడువులో పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఒకవేళ సకాలంలో నిర్మాణం జరిగితే ప్రతిపక్షాల నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు.
ఆసుపత్రి నిర్మాణంపై పెదవి విరుస్తున్న విపక్షాలకు అభివృద్ధితో బుద్ధి చెబుతానని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. మంచిర్యాల నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ, ఆర్ అండ్ బీ ద్వారా రహదారుల నిర్మాణానికి రూ. 70 కోట్లు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. రైతు భరోసాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొన్ని సవరణలు చేయడం వల్ల జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.