- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 9ను విజయవంతం చేయండి
దిశ, ఇంద్రవెల్లి : డిసెంబర్ 9న ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో నిర్వహించే ఆదివాసీ హక్కుల ఉద్యమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాయి సెంటర్ జిల్లా మెడి మెస్రం, దుర్గు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచయ్య పిలుపు ఇచ్చారు. మంగళవారం మండలంలోని రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా ఆదివాసీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఈనెల 9న నిర్వహించే సభకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చే విధంగా ఆదివాసీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చట్టబద్ధతలేని లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో 100% విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు ఆదివాసులకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయకర్త సీడం భీం రావ్, తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గొడం గణేష్, సార్ మేడిలు, మెస్రం వెంకట్ రావ్, చిన్ను, జిల్లా అధ్యక్షులు పెందుర్ దాదిరావ్, మండల అధ్యక్షులు పుర్క చిత్రు అర్క ఖమ్ము, మెస్రం నాగ్ నాథ్, కొట్నక్ బరిక్ రావ్ , పృథ్వి తదితరులు పాల్గొన్నారు.