కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం..

by Sumithra |
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం..
X

దిశ, కాసిపేట : మండలంలోని దేవాపూర్, మామిడి గూడ గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. దేవాపూర్ లో జడ్పీటీసీ సభ్యుడు పల్లె చంద్రయ్య, మామిడి గూడలో ఎంపీటీసీ అక్కిపెల్లి లక్ష్మి ముఖ్య అతిదులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరెయితర్ రాష్ట్రాలలో అమలుకావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిగూడ సర్పంచ్ సంపత్ నాయక్, దేవాపూర్ సర్పంచ్ మడావి తిరుమల అనంత్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణా రెడ్డి, మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు, భాస్కర్, వడ్లూరి మల్లేష్, పద్మ, పంచాయతీ సెక్రెటరీలు శ్వేత, కవిత, డాక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story