- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తవ్వేయ్.. అమ్మేయ్..
by Sumithra |

X
దిశ, తాంసి : మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులో మట్టితవ్వకలు జోరుగా సాగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా గత కొన్ని రోజులుగా డోజర్ల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని సరిహద్దులు దాటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువులో మట్టిని ఇప్పటికే పెద్దఎత్తున తవ్వేశారు. కొంతమంది గ్రూపులుగా ఏర్పడి మట్టితవ్వకాలు చేపడుతున్నారు.
ఇటుక బట్టీలతో పాటు వివిధ అవసరాల నిమిత్తం మట్టిని గుట్టుగా తరలిస్తున్నారు. "తవ్వేయ్.. అమ్మేయ్.." రీతిగా చెరువును ఇష్టారీతిన తోడేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాని స్థానికులు వేడుకుంటున్నారు. కాగా ఈ విషయం పై తమకు ఎటువంటి సమాచారం లేదని, అనుమతులు కూడా ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు.
Next Story