యథేచ్ఛగా జిల్లాలో ఇసుక అక్రమ దందా.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

by Disha Web Desk 23 |
యథేచ్ఛగా జిల్లాలో ఇసుక అక్రమ దందా.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
X

దిశ,నిర్మల్ రూరల్ : ఇసుక మాఫియా ఆగడాలకు నిర్మల్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా అక్రమార్కులకు వరంగా మారగా ప్రభుత్వ ఆదాయానికి మాత్రం భారీ గండి పడుతోంది. నిర్మల్ రూరల్ మండల పరిధిలోని చిట్యాల వెంగ్వా పేట్ . కాలువ, వాగుల తో పాటు నిర్మల్ సిటీ ప్రాంతాల రోడ్లపై నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యలో వాహనాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా సామాన్యుల నుంచి అందినకాడికి దండుకొంటు సొమ్ము చేసుకుంటున్నారు.

నిబంధనలకు పాతర.. మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు..

ఇసుక మాఫియా క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రాత్రి వేళల్లో జేసీబీలతో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. నిజానికి జిల్లాస్థాయి సాండ్ కమిటీ డీఎల్ ఎస్ ఈ దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ. గనుల. భూగర్భ జల. రెవెన్యూ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తారు. కానీ ఇక్కడ అవేమీ లేకుండా తవ్వకాలు జరిపి తమకు అనువైన ప్రాంతాల్లో నిర్మల్ సిటీ మధ్యన ఇసుక నిల్వలు చేసి. రాత్రి వేకువ జామున నిర్మల్ జిల్లాలోని పలు ఏరియాలతో పాటు చుట్టుపక్కల మండలం బైంసా మీదుగా మహారాష్ట్రకు సైతం ఇసుక రవాణా చేస్తున్న వారిలో నిర్మల్ కు చెందిన కొందరు నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఆయా ప్రాంతాల బట్టి ఇసుక మాఫియా రేట్లను నిర్ణయించి ట్రాక్టర్ రూ. 3000 వేల నుంచి 4000 వేల వరకు విక్రయిస్తున్నారు.

పట్టించుకోని మైనింగ్ అధికారులు..

ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ,పోలీస్ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ఇసుక లారీలు, ట్రాక్టర్ లు తరలివెళ్తున్న ప్రధాన రహదారి పక్కనే రెవెన్యూ పోలీస్ స్టేషన్ లు ఉన్న నెల ఒకటి రెండు వాహనాలను పట్టుకుని నామ మాత్రపు కేసులు, చిన్నపాటి జరిమానా విధిస్తూ వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నిర్మల్ చిట్యాల లో ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారులు దాడి చేసి నాలుగు ట్రాక్టర్ ల ఇసుక స్వాధీనం చేసుకుని, ఒక జేసీబీ, రెండు లారీలు, పలువురి పై కేసు నమోదు చేసిన దందా మాత్రం ఆగడం లేదు.ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసి, భూగర్భ జలాలు అడుగంటకుండా చూడాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.



Next Story

Most Viewed