చంద్రఘంట అవతారంలో జ్ఞాన సరస్వతి

by Sumithra |
చంద్రఘంట అవతారంలో జ్ఞాన సరస్వతి
X

దిశ, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీశారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజైన బుధవారం అమ్మవారు చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యబృందం, పోలీసుసిబ్బంది, తమ సేవలను అందిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో నాగార్జున సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో 10లక్షల విలువైన లైటింగ్ బోర్డ్స్, ట్రాఫిక్ బారికేడ్స్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి లలిత సహస్రనామ పుస్తకాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన గాడిపుర జగదీష్ మహారాజ్ అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు.

Advertisement

Next Story