- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సింగరేణి హాస్పిటల్లో అగ్నిప్రమాదం..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో ప్రమాదం కలకలం రేపింది. స్పెషల్ వార్డులో ఇవాళ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది. స్పెషల్ వార్డులో సంభవించిన ప్రమాదంతో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది సూపర్డెంట్ మధుకర్ కు సమాచారం ఇచ్చారు. ఆయన అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో సింగరేణి విద్యుత్ విభాగం కూడా హుటాహుటిన హాస్పిటల్ కు తరలివచ్చారు. ఈ సంఘటనలో స్పెషల్ వార్డు పైకప్పు, ఏసీ యంత్రం దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.
హాస్పిటల్లో వైరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం...
బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ లో అగ్ని ప్రమాదంతో రోగులు బెంబేలెత్తుతున్నారు. విఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ వార్డులో ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా హాస్పిటల్లో ఐసీయూ విభాగంలో విద్యుత్ షాక్ ఘటన నెలకొన్నది విధితమే. హాస్పిటల్లో విద్యుత్ వైరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. తత్పలితంగా హాస్పిటల్లో తరచుగా విద్యుత్ ప్రమాదాలు నెలకొంటున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో స్పెషల్ వార్డులో షార్ట్ సర్క్యూట్ ఘటన చోటు చేసుకున్నది. పలుచోట్ల షార్ట్ సర్క్యూట్ తో వైరింగ్ కాలిపోయిన దృశ్యాలు అస్తవ్యస్తమైన వైరింగ్ వ్యవస్థ తీరును స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా సింగరేణి విద్యుత్తు యజమాన్యం, విద్యుత్తు విభాగం అధికారులు హాస్పిటల్లో పటిష్టమైన వైరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని కోరుతున్నారు.