దిశ ఎఫెక్ట్​...సర్కార్ ఆస్పత్రికి బీపీ మందులు సరఫరా

by Sridhar Babu |   ( Updated:2024-11-14 10:12:01.0  )
దిశ ఎఫెక్ట్​...సర్కార్ ఆస్పత్రికి బీపీ మందులు సరఫరా
X

దిశ,ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని సర్కార్ దవాఖానాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బోర్డు నుండి పదివేల బీపీ గోళీలు సరఫరా అయ్యాయని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు బాబు తెలిపారు. మంగళవారం సర్కార్ దవాఖానాకు సుస్తీ...మందుల కోసం కుస్తీ...అనే శీర్షికన దిశ దినపత్రికలో వెలువడిన వార్తకు స్పందించిన జిల్లా వైద్యాధికారి రాష్ట్ర ఔషధ కార్యాలయం నుండి ఎల్లారెడ్డి పేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల్లో గల బీపీ పేషంట్లకు మందులు అందుబాటులో లేకపోవడంతో గురువారం ఆ మందులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. బీపీతో బాధపడుతున్న ఎల్లారెడ్డి పేట , వీర్నపల్లి మండలాల పరిధిలో గల వారు వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి బాబు కోరారు. మందులు ఎల్లారెడ్డి పేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంకు సరఫరా అయ్యేలా వార్త ప్రచురితమైన దిశకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed