జర్నలిస్టుపై దాడికి నిరసనగా రాస్తారోకో..

by Sumithra |
జర్నలిస్టుపై దాడికి నిరసనగా రాస్తారోకో..
X

దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో వాస్తవ నేస్తం సీఈవో, ఎండీ, జర్నలిస్టు సయ్యద్ ఖమర్ పై ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, హోంగార్డు మామిడి విజయ్ చేసిన దాడికి నిరసనగా మంగళవారం ఇచ్చోడలో బోథ్ డివిజన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డు పై బైఠాయించి ఎంపీపీ, హోమ్ గార్డుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బోథ్ డివిజన్ సీనియర్ జర్నలిస్టు నరాల రమణయ్య మాట్లాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండకుండా, పదవిని అడ్డం పెట్టుకుని ఏజెన్సీ లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు.

పుట్టిన రోజు వేడుక ల్లో పూటుగా మద్యం సేవించి, జర్నలిస్టు పై భౌతికంగా దాడులు చేయడమే కాకుండా, జర్నలిస్టు కుటుంబ కుటుంబ మహిళల పట్ల బూతు మాటలు మాట్లాడం ఎంత వరకు సమం జసమని అన్నారు. హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న మామిడి విజయ్ మద్యం మత్తులో జర్నలిస్టులు, సీఐ, ఎస్ఐ లపై బండ బూతు మాటలు మాట్లాడం శోచనీయమ న్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీ ని సస్పెండ్ చేయాలని, మామిడి విజయ్ ను హోమ్ గార్డు విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోథ్ డివిజన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి లిఖిత పూర్వకంగా హోమ్ గార్డు పై ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటన దానిపై ఎస్పీ కి స్పష్టంగా వివరించారు. దీనిపై ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ చేత సమగ్ర విచార ణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. హోంగార్డు పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed