ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి : జిల్లా కలెక్టర్
X

దిశ, ఆసిఫాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జిల్లాలో సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ. దాసరి వేణులతో కలిసి రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల 25 తర్వాత ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు,వికలాంగులు,85 దాటిన వృద్ధులు హోం ఓటింగ్ కోసం ఫారం 12 డీతో బూత్ లెవల్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సభలు,సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం సువిధ యాప్ లో 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతకు ముందు నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఈ నెల 24.25న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.



Next Story

Most Viewed