- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యకు కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యం
by Sridhar Babu |

X
దిశ, లక్షెటిపేట : విద్యకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథో విద్య చాలా అవసరమని, అది నెరవేర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కంప్యూటర్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story