- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ పై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
దిశ, తాండూర్ : బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ప్రారంభించనున్న గోలేటి, ఎంవీకే-3 ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ పై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గోలేటిలోని సింగరేణి కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ ను కలిసి నూతన ఓపెన్ కాస్టు ఏర్పాట్లు గురించి ఎమ్మెల్యే చర్చించారు. బెల్లంపల్లి ఏరియాలో నూతన ఓపెన్ కాస్టులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో ఓపెన్ కాస్టుల ఏర్పాట్లకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటుందని, ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ రాక జాప్యం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫారెస్ట్ భూముల గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తానని, అవసరమైతే నూతన ఓపెన్ కాస్టుల ఫారెస్ట్ భూముల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాని హామీ ఇచ్చారు. నూతన ఓపెన్ కాస్టుల ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఏరియాలో నూతన ఓపెన్ కాస్టులు ఏర్పాటు అయితే చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బయ్యా మొగిలి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, గోలేటి మాజీ సర్పంచ్ సుమలత, సింగరేణి అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.