రాజకీయ పబ్బం కోసమే అమాయకులపై కేసులు

by Sridhar Babu |
రాజకీయ పబ్బం కోసమే అమాయకులపై కేసులు
X

దిశ, ఆదిలాబాద్ : జైనూరు ఘటనలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రాజకీయ పబ్బం కోసమే అమాయక ఆదివాసులపై కేసులు నమోదు చేసిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ ధ్వజమెత్తారు. జైనూరులో గిరిజన మహిళపై అత్యాచారయత్నం, దాడి కేసులో ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ నగేష్ మాట్లాడుతూ జైనూరు ఘర్షణ కేసులో ఆదివాసీ యువకులపై అకారణంగా కేసులు నమోదు చేసి ప్రభుత్వం జైలుకు పంపుతోందని అన్నారు. గత ఆరు నెలల కిందట జరిగిన ఘర్షణ ఆఫీసులో 400 మంది యువకులను బెదిరించి దాడులు చేస్తే నిందితులను కాపాడి బాధితులపై కేసులు నమోదు చేశారని అన్నారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ హిందువులను టార్గెట్ గా చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వం మరో వర్గాన్ని కాపాడుతుందని విమర్శించారు. అమాయక ఆదివాసులపై కేసులు నమోదు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే ఓ జవాన్ కుటుంబానికి చెందిన బట్టల షాపును దుండగులు తగలబెట్టారని, ఆయన అక్కడి నుండి ఫోన్లో తన ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. తన కుటుంబానికి రక్షణ లేదని, దేశం కోసం పాటుపడుతున్న తనకు ఆవేదన కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్,లాలా మున్న, జోగు రవి, దినేష్ మాటోలియ, శ్రీనివాస్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed