- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోషులను కఠినంగా శిక్షించాలి..
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుద్దాల గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస.. బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. అది మనించిన పోలీసులు చాకచక్యంగా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంలో వార్తను కవర్ చేసే దిశలో నిమగ్నమై ఉన్న ప్రముఖచానల్ మంచిర్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్, కెమెరామెన్ పై టీఆర్ఎస్ నాయకులు దాడిచేసి కారు అద్దాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని, తమపై దాడి చేసిన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్టర్ శనివారం ఫిర్యాదు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ తమడ్యూటీలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విలేకరుల పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రతికార్య చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖచానల్ సిబ్బందితో పాటు ప్రెస్ క్లబ్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.