నేషనల్ హైవే దిగ్బంధం చేసిన బీజేపీ.. మద్దతు తెలిపిన తుడుందెబ్బ నాయకులు

by Disha Newspaper Desk |
నేషనల్ హైవే దిగ్బంధం చేసిన బీజేపీ.. మద్దతు తెలిపిన తుడుందెబ్బ నాయకులు
X

దిశ, ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఇంధని ఎన్‌హెచ్ రోడ్డులో బిజేపీ నాయకులు మహా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఇందుకు తుడుందెబ్బ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణా సరిహద్దు ప్రాంతం అయిన గోయాగాంలోని ఎన్‌హెచ్ రోడ్డు వలన భూములు కోల్పోయిన వారు 2 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కానీ ఇంత వరకు వారికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. అమాయక ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

అంతే కాకుండా ఇందనీ ఎక్స్ రోడ్ లో యూ టర్న్ ఇప్పించాలని పలు మార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని జెడ్‌పీ‌ఎస్‌ఎస్ ముంధు ప్లై ఓవర్ రోడ్డు రావడం వలన ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారన్నారు. అందుకుగాను అండర్ బ్రిడ్జి రోడ్డు చేయించాలన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నాను విరమించేది లేదని.. నినాదాలతో అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆదివాసీ అమాయక ప్రజలను మోసం చేస్తున్నా ఆర్డీవో‌నీ వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 2 గంటల పాటు ధర్నా నిర్వహించగ రాకపోకలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక సీఐ, ఎస్ఐ చొరవ తీసుకొని తహశీల్దార్‌తో మాట్లాడి రప్పించి ఆర్డీవో తో ఫోన్ ద్వారా మాట్లాడించారు.

అలాగే వీలైనంత తొందరగా భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విదంగా ఎన్‌హెచ్ అధికారులు కూడా ధర్నా స్థలానికి చేరుకుని కచ్చితంగా యూ టర్న్ కల్పిస్తామని వాంకిడి మండల కేంద్రములోని జేడ్‌పీఎస్ఎస్ ముందు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపిస్తమని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కోవ విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు కోట్నక్ రాంషవ్ , బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏలగతి సుచిత్, బీజేపీ మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్, జిల్లా నాయకులు కమలకర్ సాయినాథ్, మారుతి, కార్యకర్తలు ప్రజలు సర్పంచ్‌లు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed