Bhainsa: పంచాయతీ బిల్స్ పెండింగ్.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వినతిపత్రం

by Shiva |
Bhainsa: పంచాయతీ బిల్స్ పెండింగ్.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వినతిపత్రం
X

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా బైంసా మండలం ఖాత్ గాం గ్రామ పంచాయతీని కొన్నాళ్లుగా సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వం నుంచి పలుమార్లు అవార్డులు అందుకుని జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దామని పాలకవర్గ సభ్యులు తెలిపారు. అయితే, రెండేళ్ల నుంచి గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, వీధి దీపాల బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, బిల్స్ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ భవనం, ట్రాక్టర్ వేలంపాట వేయాలనుకుంటున్నామంటూ వారంతా భైంసా తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఆ వినతి పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం చూసిన సామాన్య జనం ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed