జీపీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి: బండి రమేష్

by S Gopi |
జీపీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి: బండి రమేష్
X

దిశ, మంచిర్యాల టౌన్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఇంతవరకు ఆన్లైన్లో ఉంచకపోవడం బాధాకరమని వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆన్లైన్లో ఉంచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మంగళవారం తపస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జీపీఎఫ్ ఖాతాలలో ఇప్పటివరకు ఉన్న నిల్వ కానీ, మిస్సింగ్స్ క్రెడిట్స్ కానీ తెలుసుకోలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ ఖాతాల నుండి అత్యవసరాల కోసం కనీస ఋణాలను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండగా, గత సంవత్సరం లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇప్పటికి చాలామందికి మంజూరు కాలేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయింపు శ్రీనివాసరావు, బగ్గని రవికుమార్, సమ్మయ్య, భారతీ అశోక్, అయిందాల నాగేందర్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story