- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా అక్కల అంజలీదేవి
by Sumithra |

X
దిశ, దండేపల్లి: దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అక్కల అంజలీదేవి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకమైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ పూర్తి చేసిన ఈమె హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈమె భర్త తిరుపతి వర్మ కూడా హైకోర్టు న్యాయవాది కావడం విశేషం. ఆయన తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ గా పనిచేశారు. మూడేళ్ల పాటు హైకోర్టు ఏజీపీగా కొనసాగారు. కాగా, తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు అంజలీదేవి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story