- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adilabad : అంధకారంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ..షాక్ ఇచ్చిన విద్యుత్ శాఖ
దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీ అంధకారంలోకి వెళ్ళింది.బుధవారం విద్యుత్ శాఖకు మున్సిపాలిటీ నుంచి రావాల్సిన మూడు కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో ఆ శాఖ అధికారులు ఒక్కసారిగా విద్యుత్ ను నిలిపివేశారు.దీంతో మున్సిపల్ కార్యాలయంలో కార్యకలాపాలు 3 గంటలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీ విద్యుత్ శాఖకు మూడు కోట్ల బకాయి ఉంది. అయితే ఈ బకాయి చెల్లించక పోవడంతో ఒక్కసారిగా ఆ శాఖ అధికారులు రియాక్ట్ అయ్యారు. మున్సిపల్ శాఖకు విద్యుత్ కట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెంటనే మున్సిపాలిటీకి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఒక్కసారిగా కార్యకలాపాలని నిలిచిపోయాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం మునిసిపాలిటీకి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుగా అధికారులు తలలు బాదుకున్నారు.
ఈ విషయం ఆ నోట ఈ నోట మాజీ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన తనయుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న క్రమంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే కచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా కొనసాగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి స్థాయిలో విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి విద్యుత్ సరఫరాను కొనసాగించాలని కోరడంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు సాయంత్రం నాలుగు గంటలకు మునిసిపాలిటీకి సరఫరాను కొనసాగించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆదిలాబాద్ మున్సిపాలిటీ నుంచి విద్యుత్ బిల్లు మూడు కోట్ల రూపాయల వరకు బకాయి ఉండడంతో సాధారణ ప్రజల సైతం దీనిపై చర్చించుకుంటున్నారు. వేల రూపాయల్లో బకాయి ఉంటేనే ఇళ్లకు కరెంటు తొలగించే అధికారులు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఇప్పటివరకు విద్యుత్ సరఫరా ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి విద్యుత్ సరఫరాల నిలిపివేయడంతో పలువురు రాజకీయ ప్రజా ప్రతినిధులు సైతం ఇది రాజకీయ నాయకుల స్వయంకృత అపరాదమేనని చెబుతున్నారు.