- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాంధీ భవన్ దగ్గరికొస్తే.. తెలంగాణ భవన్ పేల్చేస్తాం: అద్దంకి దయాకర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఇద్దరి నేతల కామెంట్స్ ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ‘‘పొట్టొడు.. పిసికితే ప్రాణం పోతుంది’’ అని రేవంత్ రెడ్డిని మంత్రి తలసాని విమర్శించగా.. ’’గుట్కాలు తినేవాడు.. పెండ పిసికేవాడు.. దున్నపోతు’’ అని మంత్రి తలసానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు కురిపించుకుంటున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని.. కులం అడ్డుపెట్టుకుని గొడవలు పెట్టలానుకుంటున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. తలసానికి శ్రీనివాస్ యాదవ్‌కు గాంధీభవన్ దగ్గరికి వచ్చే ధైర్యం ఉందా.. ఒకవేళ వస్తే తెలంగాణ భవన్‌ను పేల్చాస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు చిత్త శుద్ది ఉంటే యాదవులకు సీఎం పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి 48 గంటల్లోగా తలసానికి, యాదవులకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.