- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Addanki Dayakar: కేటీఆర్.. నీ ఓవరాక్షన్ ఆపు.. నువ్వు ఏసీబీని టెస్ట్ చేయట్లేదు: అద్దంకి దయాకర్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Formula E car race case) ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తాజాగా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అని పక్కన పెట్టి.. తనే ప్రభుత్వాన్ని, పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్లు కన్పిస్తోందని అభిప్రాయపడ్డారు.
నిన్ను ఏసీబీ ఇంటరాగేట్ చేస్తుందని గుర్తు పెట్టుకో.. నువ్వు ఏసీబీని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.. అంటూ పేర్కొన్నారు. పోలీసుల ఇంటరాగేషన్ అంశాలు బయటకు చెప్పొచ్చా? ఆ సోయి కూడా లేదా? నీ ఓవరాక్షన్ చూస్తుంటే నీ మీద సానుభూతి కంటే నీ అతి ప్రసంగాలు సమస్యగా మారింది.. నీ ఓవరాక్షన్ బంద్ చేస్తే మంచిదని అంటూ విమర్శలు గుప్పించారు. నీకు చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంటే వాటికి సహకరించాలని సూచించారు.