- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP మాజీ ఎమ్మెల్యేకు అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ BJP కీలక నేత, ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం దయాకర్ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. దివాలాకోరు రాజకీయాలకు బీజేపీ నిదర్మనమని విమర్శించారు. అవినీతిని పెట్టుబడిగా పెట్టిన పార్టీ బీజేపీ అని సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఏనాడూ పేదలు, దేశ ప్రజల గురించి ఆలోచించదని అన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా బీజేపీ దిగజారుడు తనానికి NVSS ప్రభాకర్ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నుంచి తుంగతుర్తి నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వబోయే పదవి కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు NVSS ప్రభాకర్ ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.