CM KCR ప్రధాని కావాలని వినూత్న రీతిలో ఓ యువకుడు మొక్కులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-06 06:42:33.0  )
CM KCR ప్రధాని కావాలని వినూత్న రీతిలో ఓ యువకుడు మొక్కులు (వీడియో)
X

దిశ, కాగజ్ నగర్ : ఓ యువకుడు ఏకంగా సీఎం కేసీఆర్ ప్రధాని కావాలంటూ, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలంటూ, ఎమ్మెల్యే కోనప్ప ఉన్నత స్థాయిలో ఉండాలంటూ తిరుపతి దేవస్థానం వద్ద కొండపై మోకాళ్ళతో నడుచుకుంటూ మొక్కులను తీర్చుకున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీరాభిమాని సాయిరాం. గతంలో ఎమ్మెల్యే కోనప్ప ఫ్లెక్సీ‌తో హిమాలయాలను అధిరోహించాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పథకాలకు ఆకర్షితుడై 101 మందిరాల గుళ్ళు గోపురాలు దర్శనానికి బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి కాలినడకన మోకాళ్లపై మెట్ల‌పైన నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకున్నాడు. తన మొక్కు నెరవేరితే 1001 దేవుళ్ళ దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపాడు. కెసిఆర్ ఫ్లెక్సీతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ వీడియో నెట్టింట, వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొడుతుంది.

Also Read..

3 పథకాలు.. 6 ఆత్మహత్యలు.. 9 ఏళ్ల KCR పాలనలో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువ!

Advertisement

Next Story

Most Viewed