Telangana: అవిశ్వాస తీర్మాణాల జోరు.. ఆ మున్సిపాలిటీలో ట్విస్టుల హోరు

by Indraja |   ( Updated:2024-01-27 09:13:50.0  )
Telangana: అవిశ్వాస తీర్మాణాల జోరు.. ఆ మున్సిపాలిటీలో ట్విస్టుల హోరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం లోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణాలు జోరు గా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్ర పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మాణ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట కలెక్టర్ వెంకట్రావు ఉదయం 11 గంటలకు సూర్యాపేట మున్సిపల్ సమావేశానికి హాజరైయ్యారు. కానీ ఇప్పటివరకు రెబెల్ కౌన్సిలర్లు ఒక్కరు కూడా హాజరు కాలేదు.

కాగా నిన్నటివరకు ఈ అవిశ్వాస తీర్మాణాన్ని గెలిచేందుకు 32 మంది కౌన్సిలర్ల మద్దతు కావాల్సి ఉన్నది. అయితే రాత్రి నుండి ఒక్కోక్కరుగా కౌన్సిలర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీనితో అవిశ్వాస తీర్మానంలో గెలుపొందేందుకు కావాల్సినంతమంది కౌన్సిలర్లు లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారు లోని కన్వెన్షన్ లో కౌన్సిలర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడంతో సూర్యారావు పెట్ కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక సమావేశాన్ని మధ్యాహ్నం 3 వరకు వాయిదా వేశారు.


Advertisement

Next Story