- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ జాతీయ పార్టీలో కవితకు చోటు?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని, కొత్త పార్టీ ప్రకటనకు మూహుర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అన్ని సజావుగా జరిగితే రాబోయే దసరా నాడు గులాబీ బాస్ నేషనల్ పార్టీ అనౌన్స్ చేయడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన కసరత్తు అంతా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది. అయితే తాను స్థాపించబోయే కొత్త పార్టీ టీమ్ లో టీఆర్ఎస్ కు చెందిన నేతలకు కీలక పదవులు దక్కబోతున్నట్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర లేచింది.
కేసీఆర్ నేషనల్ టీమ్ లోకి కవిత?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే చర్చ మొదలైన నాటి నుంచి ఆ పార్టీ పేరు ఏంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. అయితే రైతు సమస్యలే ప్రధానంగా పార్టీ పేరు, జెండా, ఎజెండా ఉండబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్ ను సీఎం కేసీఆర్ సిద్ధం చేసుకున్నారని ఇందులో తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు చోటు దక్కబోతుందనే ప్రచారం జోరందుకుంది. కవితతో పాటుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు మరికొంత మంది ముఖ్యనేతలను తన కొత్త పార్టీ టీమ్ లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ జిల్లా పర్యటనలో టీఆర్ఎస్ నేతలు రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక మైన పాత్ర పోషించబోతున్నారని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.
వారసత్వ పేచీ లేకుండా జాగ్రత్త?:
జరుగుతున్న చర్చ ప్రకారం కవితను జాతీయ పార్టీ టీమ్ లోకి తీసుకోవడం వెనుక రాష్ట్ర స్థాయిలో తన వారసుడు కేటీఆర్ కు కేసీఆర్ లైన్ క్లియర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఉన్న పళంగా రాష్ట్ర రాజకీయాలను వదలకపోయినా భవిష్యత్ లో టీఆర్ఎస్ పార్టీలో ముసలం ముదరకుండా ఇప్పటినుండే జాగ్రత్తలు పడుతున్నాడనే చర్చ జరుగుతోంది. మరో వైపు స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కోల్డ్ వార్ సాగుతున్న వేళ రాజకీయల్లో సుధీర్ఘమైన అనుభవం కలిగిన శ్రీహరిని తన కొత్త టీమ్ లో చేర్చుకోబోతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారుతోంది. రవీందర్ సింగ్ ఇటీవల కేసీఆర్ తో విభేదించినా తిరిగి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ, బిహార్ టూర్ లో సీఎంతో రవీందర్ సింగ్ కనిపించడం ఆసక్తిగా మారింది. ఓ వైపు లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో జాతీయ పార్టీలో కూతురు కవితకు చోటు దక్కబోతుందనే ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.
Also Read : యువరాజుకు నో చాన్స్.. సీఎంగా కేటీఆర్‌కు అవకాశం లేనట్లే!