భైంసాలో నకిలీ నోట్ల కలకలం..!

by Sathputhe Rajesh |
భైంసాలో నకిలీ నోట్ల కలకలం..!
X

దిశ, బైంసా: భైంసా పట్టణంలో ప్రతి సోమవారం వారాంతపు సంత జరుగుతుంది. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వస్తారు. అయితే సంతలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. సాయంత్రం 6:30 సమయంలో దాదాపు 12 ఏళ్ల ఓ బాలుడు బోకర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి వద్దకి రూ. 500 రూపాయల నోటు ఇచ్చి 20 రూపాయల కూరగాయలు కొని 480 తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి మరో 500 రూపాయల నోటు తీసుకువచ్చి సేమ్ తంతు నిర్వహించాడు.

నకిలీ నోటనే అనుమానం వచ్చిన కూరగాయల వ్యాపారి ఆ బాలున్ని పట్టుకునే ప్రయత్నం చేసి, విఫలమయ్యాడు. బాలుడు పరిగెత్తి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై తిరుపతి అక్కడికి చేరుకొని పరిశీలించారు. బాలుడి ఆచూకీ కోసం సీసీ కెమెరాల సహాయంతో గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రూ.500 రూపాయల నోటు నకిలీల కనిపిస్తుందని, కూరగాయల వ్యాపారి ప్రవీణ్ సహాయంతో బాలుడిని గుర్తించే పనిలో వున్నామని పోలీసులు తెలిపారు. బాలుడు దొరికితే నకిలీ ముఠా సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story