- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర సంబంధం.. చితకబాదడంతో ఓ వ్యక్తి..
దిశ, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేని పల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే మాచినేని పల్లి గ్రామానికి చెందిన మూరకొండ రాముడు (45) అనే వ్యక్తి , అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మహిళతో కలిసి రాములు ఊరు బయట ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకొని.. ఆ మహిళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రాములును చితకబాదినట్లు సమాచారం.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాములును హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మరణించాడు. రాముడు మరణించాడు అన్న విషయం తెలుసుకున్న ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. డీఎస్పీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హత్యకు గల కారణాలు, హత్యకు పాల్పడిన వారి వివరాలను సేకరిస్తున్నారు.