అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్తో పూలజల్లు

by Javid Pasha |   ( Updated:2023-04-14 10:35:30.0  )
అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్తో పూలజల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ట్యాంక్ బండ్ నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూలజల్లు కురిపించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అంబేద్కర్ స్మృతి వనానికి రాగా.. వారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి గులాబీ పూలు కురిపించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. కాగా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రదినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more:

న్యూస్: భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్...స్పెషల్ అట్రాక్షన్‌గా హెలికాప్టర్ల పూల వర్షం...చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రకాశ్ అంబేద్కర్

Advertisement

Next Story