BRAKING: మాసబ్ ట్యాంక్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద అగ్నిప్రమాదం

by Ramesh N |   ( Updated:2024-07-11 12:41:23.0  )
BRAKING: మాసబ్ ట్యాంక్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద అగ్నిప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పిటిఐ బిల్డింగ్ పక్కన ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలి మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రైల్ నిల‌యం వ‌ద్ద అగ్నిప్రమాదం

మరోవైపు సికింద్రాబాద్ రైల్ నిల‌యం వ‌ద్ద వేగంగా వెళ్తున్న కారులో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ కారును ప‌క్క‌కు ఆపేశాడు. క్ష‌ణాల్లోనే కారులో మంట‌లు చెల‌రేగి పూర్తిగా కాలిపోయింది. వెంటనే స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. రైల్ నిల‌యం వ‌ద్ద ఏర్ప‌డిన ట్రాఫిక్ జామ్‌ను పోలీసులు క్లియ‌ర్ చేశారు. ఇంజిన్ వేడి కావ‌డంతోనే మంట‌లు చెల‌రేగిసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదం నుంచి డ్రైవ‌ర్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

Advertisement

Next Story