మేడారం జాతరలో భక్తుడికి గుండెపోటు.. కాపాడిన రెస్క్యూ టీమ్

by Prasad Jukanti |
మేడారం జాతరలో భక్తుడికి గుండెపోటు.. కాపాడిన రెస్క్యూ టీమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని రెస్క్యూ టీమ్ కాపాడింది.పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి జాతర క్యూ లైన్ లో ఉండగా గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో వైపు సమ్మక్క, సారక్క మహా జాతర ఇవాళ ప్రారంభమైంది. జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.



Next Story

Most Viewed