- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. డంపింగ్ యార్డు గోడ కూలి చిన్నారి మృతి
దిశ, భువనగిరి రూరల్ : చెత్త డంపింగ్ యార్డ్‌లో ప్రమాదం జరిగి ఓ చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని అస్సాం కు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద మున్సిపల్ చెత్త ఆటో శిలాఫలకానికి ఢీ కొట్టగా దాని పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపై పడడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ శిలాఫలకన్నీ 2020 సంవత్సరంలో మంత్రి కేటీఆర్ భువనగిరిలో శంకుస్థాపన చేశారు. గాయపడిన వారిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు చెత్త డంపింగ్ యార్డ్‌లో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి వాహనం నడపడం కారణంగా ప్రమాదం జరిగిందని గుర్తించారు.