- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటనపై కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో: అంబర్‌పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై శుక్రవారం అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత 3 రోజులపాటు లీగల్ ఓపీనియన్ తీసుకుని బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ ఒంటరిగా వెళుతుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.
దీంతో బాలుడు భయపడిన వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి వదలలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంభందించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.