శ్రీరామనవమి స్పీచ్‌ ఎఫెక్ట్: MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

by GSrikanth |   ( Updated:2023-04-01 07:39:14.0  )
శ్రీరామనవమి స్పీచ్‌ ఎఫెక్ట్: MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీస్ కేసులు వీడటం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు అయింది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అప్జల్‌గంజ్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. విద్వేష పూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయవద్దని బెయిల్ సమయంలో ఆయనకు విధించిన షరతులను ఉల్లంఘించి మాట్లాడారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జనవరి 29న ముంబై మంగళ్ హాట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఐపీసీ సెక్షన్ 153ఎ1(ఏ) కింద ముంబై పోలీసులు సైతం ఇటీవలే ఆయనపై కేసు నమోదు చేశారు. వరుసగా కేసులు నమోదు అవుతున్నా రాజాసింగ్ మాత్రం వెనక్కి తగ్గకపోవడం హాట్ టాపిక్‌గా మారుతోంది.

Advertisement

Next Story