ఆర్టిజన్లకు 7 శాతం ఫిట్ మెంట్.. సర్క్యులర్ జారీ చేసిన సర్కార్

by Satheesh |
ఆర్టిజన్లకు 7 శాతం ఫిట్ మెంట్.. సర్క్యులర్ జారీ చేసిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్లకు 7 శాతం ఫిట్ మెంట్ అందించనునున్నారు. గురువారం దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను జారీ చేశారు. 7 శాతం ఫిట్ మెంట్‌ను ఏప్రిల్ 2022 నుంచి అందించనున్నారు. ఇదిలా ఉండగా గ్రేడ్ 1 నుంచి మొదలుకొని గ్రేడ్ 4 ఆర్టిజన్ల వరకు పర్సనల్ పే కింద డీఏ, హెచ్ఆర్ఏను అందించనున్నారు. మే 2021 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వీస్ వెయిటేజీ కింద రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. మెడికల్ అలొవెన్స కింద రూ.1350 ని ఏప్రిల్ 2022 నుంచి అందించనున్నట్లు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తమకు 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ఆర్టిజన్లు డిమాండ్ చేశారు. సమ్మెకు దిగారు. సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించింది. అయినా సమ్మెకు వెళ్లడంతో దాదాపు 200 మందిని తొలగించారు. చివరకు యాజమాన్యాల ఒత్తిడికి ఆర్టిజన్లు తలొగ్గారు. దీంతో తొలగించిన వారిని తిరిగి 10 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని సంస్థలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed