Telangana Road Accidents : రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 20 మంది దుర్మరణం

by Ramesh N |   ( Updated:2024-11-11 10:41:56.0  )
Telangana Road Accidents : రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 20 మంది దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో రోజుకు సగటున 20 మంది మరణిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌గా ఎన్నికైన అభ్యర్థులకు సోమవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రోడ్డు సేఫ్టీపై అన్ని స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రవాణా శాఖలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 113 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారని అన్నారు. వీరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో వినియోగిస్తామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలో మొదటి సారి ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ముఖ్యమంత్రి రావడం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో వాహన స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తేవాలని సీఎం అనుమతి తో 37 టెస్టింగ్ సెంటర్స్ కి జీవో తెచ్చుకున్నామని అన్నారు.

రవాణా శాఖ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇతర వాటిలో రూల్స్ ప్రకారం ముందుకు పోతున్నామని, రవాణా శాఖను సరిదిద్దడానికి కొత్తగా నియామకం అవుతున్న ఏఎంవీఐలను చెక్ పోస్టులకు కాకుండా ఎన్ఫోర్స్‌మెంట్‌లో ఉపయోగించుకొని శాఖ గౌరవాన్ని పెంపొందించాలన్నారు. కొత్తగా నియామకం అవుతున్న వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed